• 02-Jun-21
  • Main Edition
  • District
  • Zone
  • SUNDAY MAGAZINE
  •    
BREAKING NEWS:
రిటైర్‌మెంట్‌ రోజే అనంతలోకాలకు.. లోకోపైలట్‌ ఇంట విషాదం!ఆర్‌బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్‌.. NSDLకు సెబీ ఊరటఈ- క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబయి ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన సారా తెందూల్కర్ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువును పొడిగించిన తెలంగాణ ప్రభుత్వంఐదుగురి నుంచే మీ పార్టీ అధ్యక్షుడు వస్తారు.. మా పార్టీ అలా కాదు ..ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక వ్యవస్థ కీలకం - రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌కంచ గచ్చిబౌలి భూముల్లో రేపటివరకు పనులు ఆపాలి: తెలంగాణ హైకోర్టుఅక్రమ మైనింగ్‌ కేసు.. కాకాణి గోవర్ధన్‌కు మరోసారి నోటీసులురాణించిన సూచీలు.. 23,300 ఎగువకు నిఫ్టీసైన్స్‌ ఫిక్షన్‌ను ఫాంటసీ అనుకున్నారు.. కానీ: ‘ఆదిత్య 369’ విశేషాలు చెప్పిన దర్శకుడు

  • Show Clips
  • Add Clip
  • Save Clip
Page 01
మా ఉద్దేశం అది కాదు:సునీల్ అరోడా

మా ఉద్దేశం అది కాదు:సునీల్ అరోడా
దిల్లీ: ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో జోక్యం చేసుకోవడం ఎన్నికల సంఘం(ఈసీ)
దిల్లీ: ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో జోక్యం చేసుకోవడం ఎన్నికల సంఘం(ఈసీ)
దిల్లీ: ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో జోక్యం చేసుకోవడం ఎన్నికల సంఘం(ఈసీ)

దిల్లీ: ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో జోక్యం చేసుకోవడం ఎన్నికల సంఘం(ఈసీ) ఉద్దేశం కాదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా స్పష్టం చేశారు.

దిల్లీ: ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో జోక్యం చేసుకోవడం ఎన్నికల సంఘం(ఈసీ) ఉద్దేశం కాదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా స్పష్టం చేశారు. సోదాలపై మీడియా, ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే రెవెన్యూ విభాగం, కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ)కి లేఖలు రాసినట్లు ఆయన వివరించారు. తనిఖీలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఉద్దేశంతోనే ఈసీ వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. ‘‘కొన్ని మౌలిక విషయాల్ని పదే పదే చెప్పాల్సి వస్తుంది. అందులో భాగంగానే ప్రచారంలో సైనిక దళాల ప్రస్తావన, ఐటీ సోదాల విషయంలో మేం పలుసార్లు సూచనలు చేయాల్సి వచ్చింది. మీడియాలో వస్తున్న కథనాల్ని చూసి.. సోదాలు నిష్పక్షపాతంగా జరగాలని మేం ఆదేశించాం’’ అని ఓ ఆంగ్ల మీడియాతో సునీల్ అరోడా అన్నారు.

ఎన్నికల వేళ అక్రమ నగదుకు సంబంధించిన సమాచారాన్ని ఈసీకి కచ్చితంగా చేరవేయాల్సిన అవసరం ఉందని సునీల్ అరోడా గుర్తుచేశారు. అలాగే సీబీడీటీ ఛైర్మన్‌, రెవెన్యూ విభాగం కార్యదర్శికి నిన్న జరిగిన సమావేశంలో సమన్లు జారీ చేశారని వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. వారు ఉన్నతాధికారులనీ.. వారికి సమన్లు జారీ చేసే అధికారం తమకు లేదని తెలిపారు. కేవలం సోదాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో చర్చల నిమిత్తమే వారితో సమావేశమయ్యామని వివరించారు. ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐటీ సోదాలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర సంస్థలను భాజపా వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.